యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత చేసిన సోలో సినిమా ‘దేవర.’ ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్‌కి మాత్రం సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ వన్ మెన్ షో చేసాడని టాక్ వినిపిస్తోంది. కాగా దేవర, వర క్యారెక్టర్స్‌ని దర్శకుడు కొరటాల చాలా అద్భుతంగా చెక్కాడని అంటున్నారు. ఈ మూవీ రిజల్ట్ ఏంటో చెప్పడానికి ఇప్పుడే ఇంకా సమయం ఉంది కానీ, ఓ విషయంలో ఎన్టీఆర్ మిగతా హీరోలను దాటేసాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
విషయం ఏమిటంటే, ‘దేవర’ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నట్లే అని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులతో ఎన్టీఆర్ బాగా కనెక్ట్ అయ్యాడని అంటున్నారు. ఇక దేవర సినిమా మిక్స్డ్ టాక్ నడుస్తున్నప్పటికీ మొదటి రోజే 177 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకొని ప్రూవ్ చేసుకుంది. దీన్ని బట్టి ఈ సినిమాకి ఎంతటి ఆదరణ లభించిందో అర్థమవుతోంది. ఇక సరైన కథ పడితే, సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో వెయ్యి కోట్లకు పైనే కలెక్షన్స్ కొల్లగొట్టే సత్తా ఎన్టీఆర్‌కి ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో మాత్రం మిగతా హీరోల కంటే ఎన్టీఆర్ మెరుగ్గా ఉన్నాడని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ నుండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా క్యూలో ఉన్నారు. వీరిపై నిర్మాతలు 300+ కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఇపుడు సిద్ధంగా ఉన్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. అయితే, వీరందరి కంటే వేగంగా పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ స్టార్‌గా నిలబడే సత్తా ఎన్టీఆర్‌కి ఉందనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఇక దానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రభాస్ ఎక్కువగా ఇంట్రావర్ట్ లా ఉంటాడు. అదే కోవకు చెందుతాడు రామ్ చరణ్ కూడా. కానీ, ఎన్టీఆర్ అలా కాదు. పైగా ఎన్టీఆర్ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలు చాలా బాగా మాట్లాడగలడు. అందుకే ‘వార్ 2’, ‘డ్రాగన్’ లాంటి సినిమాలు ఎన్టీఆర్ లైనప్ లో ఉన్నాయి. దాంతో మరి కోణాల్లో ఎన్టీఆర్ వీరిని దాటి టాప్ రేంజ్‌లోకి చేరిపోవడం ఖాయం అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.