అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చింది మెగాఫ్యామిలీ అండతో అయినా, ఈరోజు అల్లు వారి ఫ్యామిలీ ఘనతని బయటకు తీసుకు వచ్చేలా బన్నీ చేస్తున్న కృషి న భూతొ న భవిష్యతి. ఇక ఈ ఐకాన్ స్టార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో వస్తున్నా పుష్ప‌-2 సినిమాతో బన్నీ అన్ని రికార్డుల‌కు చెక్ పెట్ట‌బోతున్నాడా? అనే అనుమానం మార్కెట్లో బాగా నడుస్తోంది. పుష్ప‌-2 డిసెంబ‌ర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. డిసెంబ‌ర్ 6న ఈ సినిమా భారీ అంచ‌నాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది.

ఈ నేపథ్యంలోనే డే1 వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డు లిఖించ‌డానికి బ‌న్నీ సిద్ధం అవుతున్నదని విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. సినిమాకి ఉన్న బ‌జ్ ని బేస్ చేసుకుని ఈ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు మెగా ఫామిలీ ఫాన్స్ బన్నీపైన ఒకింత గుర్రుగా ఉన్న సంగతి కూడా తెలిసినదే. అయితే దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మెగాఫ్యామిలీ ఫాన్స్ మాత్రం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మరే అవకాశం లేకపోలేదు అని తెలుస్తోంది.

ఇకపోతే తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇంత‌వ‌ర‌కూ ఏనటుడికి సాధ్యం కానిది బ‌న్నీకి సాధ్యమైందని చెప్పుకోవచ్చు. విషయం ఏమంటే, జాతీయ స్థాయిలో జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డుని సొంతం చేసుకోవడం అంటే మాటలు కాదు! అలాంటి ఫీట్ బన్నీ అందించాడు కాబట్టి, అనుకోకుండానే `పుష్ప‌-2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో డే వ‌న్ నుంచే పుష్ప 2 సినిమా కొత్త చ‌రిత్ర రాస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అర్ష‌ద్ వార్షి విశ్లేషణ ప్రకారం, 224 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే కొత్త రికార్డు న‌మోదు చేస్తుంద‌నే అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్ని ప్రామాణికంగా తీసుకుని లెక్క గ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: