పవర్ స్టార్ పవన్ కల్యాణ్  ఈ పేరు వింటే ఏదో తెలియని వైబ్రేషన్, తెలియని ఎనర్జీ  ఇక పీకే ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. ప్రతి సినిమాకి కలెక్షన్స్ వస్తూ, రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటున్నారు. హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్షేక్ కావాల్సింది. నయా రికార్డులు క్రియేట్ చేయాల్సిందే. అలాంటి పవన్ నుంచి న్యూ రిలీజెస్ కోసం ఫ్యాన్స్ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో 1950ల బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కనిపించనున్నారు. గ్లింప్స్‌లో పవన్ యాక్షన్, స్వాగ్, స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది.ఇదిలావుండగా ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27నేఅని చాలా రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను తెరకెక్కిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్  ఫిబ్రవరి 6తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచీ సోషల్ మీడియా ఎక్స్ లో దే కాల్ హిమ్ ఓజీతోపాటు పవన్ కల్యాణ్ ట్రెండింగ్ లో ఉన్న సంగతి కూడా తెలిసిందే.ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013లో సెప్టెంబర్ 27వ తేదీనే విడుదలైంది. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. దీంతో అదే సెంటిమెంట్‍తో ఈ ఏడాది 2024 సెప్టెంబర్ 27న ఓజీని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా చాలా రోజుల వరకు ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 27 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం తో అక్టోబర్ నెలలో విజయవాడ లోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు మేకర్స్. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దసరా కానుకగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రానికి బదులుగా సెప్టెంబర్ 27 న ‘దేవర’ చిత్రం విడుదల అవ్వడం, ఆ సినిమా క్రేజ్, ఓపెనింగ్ వసూళ్లు చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ తేదీన మన సినిమా రావాల్సింది. వచ్చి ఉండుంటే వసూళ్ల సునామి వేరే లెవెల్ లో ఉండేది, కేవలం 20 రోజుల షూటింగ్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేసి ఉండుంటే, ఈపాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందు ఉండేది, మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు బాధపడుతున్నారు. అయితే ఓజీ మంచి క్రేజ్ ఉన్న సినిమా అని, దానికి సీజన్ తో ఎలాంటి అవసరం లేదని, ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవుతాయని, పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి అందరూ రుచి చూస్తారని అంటున్నారు అభిమానులు.ఇదిలావుండగా ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో 'దేవర' సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.74.11 కోట్లు సాధించగా.. ఇప్పుడు 'దేవర' రూ.54.21 కోట్ల షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకు ముందు ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్లతో ఈ ప్లేసులో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్-2లోని రెండు మూవీస్ కూడా తారక్‌వే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: