కొరటాల శివ దేవర.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర.ఇదిలావుండగా శుక్రవారం విడుదలైన ‘దేవర’ ఫస్ట్ పార్ట్‌లో ‘దావుడి’ పాట లేకపోవడం అభిమానులని షాక్‌కి గురిచేసింది. అయితే ఈ విషయం గత పది రోజుల నుంచి చర్చకు వచ్చినా.. చివరి నిమిషంలో యాడ్ చేస్తారేమో అని అభిమానులు వేచి చూశారు. కానీ.. చివరికి నిరాశే మిగిలింది. ఎన్టీయార్, జాన్వీ తమ పెర్ఫామెన్స్‌లతో అదరగొట్టిన ఈ పాట సినిమా నుండి తొలగించారు.ఈ సినిమా హ్యూజ్ ఎమోషన్స్‌తో సాగుతోంది. ఇలాంటి సినిమాలో భావోద్వేగాలు డైవర్ట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి సాంగ్స్‌ని ట్రిమ్ చేయడమే కరక్ట్ అని మేకర్స్‌కి అనిపించొచ్చు. అందుకే కఠిన నిర్ణయమైనా ఈ సాంగ్‌ని తొలిగించాల్సి వచ్చింది. సెన్సార్‌కి వెళ్లేముందు ట్రిమ్ చేసిన ఏడు నిమిషాల ఫుటేజీ‌లోనే ఈ సాంగ్‌ని తొలిగించినట్లు సమాచారం. కనీసం ఎండ్ కార్డ్స్ పడే సమయానికి ఈ సాంగ్ వేస్తారనుకున్నా ఓపెన్ ఎండింగ్‌తో సీక్వెల్‌కి స్పేస్ ఉన్న కథ కాబట్టి అక్కడ ఈ సాంగ్ జోడించలేకపోయారు. 

ఏదిఏమైనప్పటికీ ఫస్ట్ వీక్ కాబట్టి ఇలాంటి ట్రిమ్మింగ్ సాధారణమే. ఇక సినిమాలోని ఇతర పాటలకు ఎన్టీయార్, జాన్వీ కపూర్ స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. ప్రస్తుతానికి మొదటి రోజు కావడంతో సినిమా భారీ ఓపెనింగ్స్ మంచి కలెక్షన్స్‌తో ముందుకు సాగుతోంది. మరోవైపు హిందీలోనూ 2 గంటల 50 నిమిషాల రన్‌ టైమ్‌‌‌ని ఏడు నిమిషాలు ట్రిమ్ చేసి 2 గంటల 43 నిమిషాలకు కుదించారు. తెలుగు నటీనటుల సోలో ఇంట్రడక్షన్ సన్నివేశాలతో మరికొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో దేవర సినిమాలో దావూదీ సాంగ్ లేక తీవ్ర నిరాశ చెందుతున్న అభిమానుల్లో జోష్ పెంచేందుకు చిత్ర యూనిట్  ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జాన్వి స్క్రీన్ టైం తక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో తారక్ తో కలిసి ఆమె స్టెప్పులు వేసిన దావూదీ రొమాంటిక్ సాంగ్ యాడ్ చేసి వచ్చేవారం నుంచి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.అయితే సినిమా రెండు మూడు వారాల రన్ తర్వాత ఈ సాంగ్‌ని జోడించే అవకాశం ఉందని కొందరు ఆశపడుతున్నారు. కాగా ఈ సాంగ్ తీసేయడం మంచి నిర్ణయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: