జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఏమైందో తెలియదు కానీ తాజాగా సంక్రాంతి బరి నుంచి చిరంజీవి వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గత నెల రోజులుగా చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్నారు. మొన్న జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈవెంట్ లో కూడా ఇదే సమస్యతో బాధపడుతూ తప్పని పరిస్థితిలో హాజరయ్యారు. ప్రస్తుతం వయసు మీద పడడం కారణంగా ఆయనకు శరీరం సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే ప్రస్తుతం సినిమా షూటింగ్ సెట్లో హాజరు కాలేకపోతున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఓటిటి హక్కులను కూడా ఇంకా ఎవరు కొనుగోలు చేయలేదట. భారీ బడ్జెట్ సినిమా మరొకవైపు తక్కువ ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీఎఫ్ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయని, సంక్రాంతి లోపు పూర్తయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి తప్పుకున్నాడని తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి విశ్వంభర సినిమా విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. మొత్తానికైతే అన్ని విషయాలు తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించక తప్పదు.