రౌడీ స్టార్ బోయ్ విజయ్ దేవరకొండ గురించి చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి అనే సినిమాతో విజయ్ తెలుగు కుర్రకారు మనసులను దోచుకున్నాడు. ఇక ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానప్పటికీ విజయ్ పేరు మాత్రం అన్ని చోట్లా బాగా వినబడింది. దాంతోనే ఆ తరువాత సినిమాలు విజయ్ పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేయాలని ట్రై చేసాడు కానీ, వర్కవుట్ కాలేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ సినిమా పరిస్థితి ఏమిటో తెలియంది కాదు. కాగా విజయ్ ఆ ప్లాప్స్ నుండి తేరుకొని నెక్స్ట్ మూడు పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు.

ఈ క్రమంలోనే, నెక్స్ట్ రాబోయే ‘VD12’ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవర కొండ. అందుకే ఈ సినిమా కోసం విజయ్ తన లుక్స్ కూడా చేంజ్ చేసుకున్నాడని టాక్. కాగా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ‘VD12’ మూవీని కుక్ చేస్తున్నారట సదరు దర్శకుడు. కాగా ఈ సినిమా మీద విజయ్ చాలా నమ్మకంగా ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఇక దీని తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. ‘టాక్సీవాలా’ మూవీతో హిట్ ఇచ్చిన రాహుల్ ఇపుడు మరలా విజయ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆమధ్య రాహుల్ నానితో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి విదితమే.

ఇక రాహుల్ సాంకృత్యాన్ విజయ్ తో చేయబోయే సినిమా 18వ శతాబ్దంలో నడిచే పీరియాడికల్ జోనర్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కబోతోంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ లో మొదలు కాబోతున్న ఈ మూవీపై చాలా అంచనాలే ఉన్నాయి. అలా విజయ్ అద్భుతమైన కధలను లైన్లో పెట్టాడని టాక్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేయబోతున్నట్టు భోగట్టా. ఇక రాహుల్ సాంకృత్యాన్ కథలు చెప్పే విధానం గురించి తెలిసినదే. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కథలు తయారు చేసుకుంటాడు. విజయ్ తో చేయబోయే మూవీ కాన్సెప్ట్ కూడా అలాగే ఉండబోతోందని టాక్. కాగా ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియా సినిమా ఉండబోతుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: