స్టార్ హీరోయిన్ అనుష్క 40 ఏళ్లు పైబడిన కూడా పెళ్లి చేసుకోవడం లేదు అని ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. మరి ఇంతకీ అనుష్క పెళ్లీడు దాటిపోయినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు.. ఇప్పటి వరకు అనుష్క ఎంత మందితో డేటింగ్ చేసింది అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే నాగర్జునతో డేట్ చేస్తున్నట్టు టాక్ వినిపించింది.. అలా నాగార్జునతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నాగ్ తో ఢమరుకం, డాన్, రగడ, ఓం నమో వెంకటేశాయ, కేడి వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిందని,అలాగే ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించినట్టు టాక్ వినిపించింది.

కేవలం నాగార్జున మాత్రమే కాదు నాగ్ కొడుకు నాగచైతన్యతో పెళ్ళంటూ కూడా వార్తలు వస్తే నాగార్జున ఆ వార్తలపై ఫైర్ అయ్యారు. ఇక నాగార్జున తర్వాత హీరో గోపీచంద్ తో కూడా ఈమెకు ప్రేమ వార్తలు వినిపించాయి. కానీ అది కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి.అలాగే ప్రభాస్, డైరెక్టర్ క్రిష్, డైరెక్టర్ రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి తో కూడా అనుష్క డేటింగ్ చేస్తుంది అనే టాక్ కూడా గట్టిగా వినిపించింది.

ఇక ఇంత మందితో ఎఫైర్ వార్తలు వినిపించినప్పటికీ అనుష్క ప్రభాస్ తో మాత్రమే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.కానీ అనుష్కకి ఉన్న ఎఫైర్స్ తెలిసి ప్రభాస్ తల్లి పెళ్ళికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. కానీ ప్రభాస్ మాత్రం చేసుకుంటే అనుష్కనే చేసుకుంటా అని పట్టు పట్టడంతో అటు అనుష్క ఇటు ప్రభాస్ ఇద్దరూ పెళ్ళికి దూరంగానే ఉంటున్నారు. ఇక మధ్య మధ్యలో అనుష్క వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అవి పుకార్లు గానే మిగిలిపోతున్నాయి. కానీ ఎప్పటికైనా అనుష్క ప్రభాస్  ల పెళ్లి జరుగుతుంది అనేది ఇండస్ట్రీ జనాల టాక్

మరింత సమాచారం తెలుసుకోండి: