ఒక సినిమా కథ మొత్తం పూర్తి అయ్యాక అందులో ఒక హీరోను అనుకోవడం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అందులో వేరే హీరో నటించడం జరగడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది . ఇక పోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగినట్టు తెలుస్తుంది . అదేమిటి అనే వివరాలను తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఓ సినిమా చేయాలి అనుకున్నాడట.

ఇక అందులో భాగంగా ఆయన కోసం ఓ కథను కూడా రెడీ చేశాడట. ఆ కథ కొంత భాగం పూర్తి అయిన తర్వాత చిరంజీవి కి వినిపించాడట. ఆయన కూడా సూపర్ గా ఉంది చేద్దాం అన్నాడట. ఇక సినిమా కథ మొత్తం పూర్తి అయ్యాక రాఘవేంద్రరావు ఒక రోజు ఫోన్ చేసి ఆ సినిమా కథ నీకు అస్సలు సెట్ కాదు. ఎందుకు అంటే ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవాల్సి వస్తుంది. నీలాంటి క్రేజ్ ఉన్న హీరో చనిపోయాడు అని చెబితే ప్రేక్షకులు సినిమాతో డిస్ కనెక్ట్ అవుతారు. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

అందుకోసం ఆ కథతో నీతో కాకుండా వేరే హీరోతో సినిమా చేస్తాను అన్నాడట. దానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఆ తర్వాత రాఘవేందర్రావు ఆ కథతో అల్లుడు గారు అనే టైటిల్ తో మోహన్ బాబు హీరోగా సినిమాను రూపొందించాడట. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా చిరంజీవి తో అనుకున్న కథను మోహన్ బాబు తో తీసి రాఘవేంద్రరావు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: