నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమాను చిత్ర బృందం వారు NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ఏకంగా బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ రెండు గ్లిమ్స్ వీడియోలను కూడా విడుదల చేశారు. కానీ సినిమా టైటిల్ ను మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అలాగే ఈ మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

కానీ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటి వరకు వెలబడడం లేదు. ఇక ఇప్పటికే సంక్రాంతి పండగకు విడుదల కాబోయే సినిమాల లిస్టు పెరుగుతుంది. దానితో వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకైనా NBK 109 మూవీ విడుదల అవుతుందా ..?  లేదా అనే అనుమానాలతో బాలయ్య అభిమానులు సతమతం అవుతున్నారు. అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి లాంటి మూడు విజయాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో NBK 109 మూవీపై బాలయ్య అభిమానుల్లో , సాధారణ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk