అశ్విని దత్ తెలుగు సినిమా రంగంలో తన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ చలనచిత్ర నిర్మాత . అతను 1974లో వైజయంతీ మూవీస్ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాడు , ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో, అతను 40 చిత్రాలకు పైగా నిర్మించాడు, వాటిలో ఎక్కువ భాగం తెలుగులో మరియు కొన్ని హిందీ మరియు తమిళ భాషలలో ఉన్నాయి.  అతను విలాసవంతమైన నిర్మాణ విలువలతో కూడిన భారీ-బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు.స్టార్ నిర్మాత అశ్వనీదత్ పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అశ్వనీదత్ వైజయంతీ బ్యానర్‌పై కల్కి సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 27న విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ. 1150 కోట్లు వసూలు చేసింది. అయితే ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె, మృణాల్, దుల్కర్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ నటించి మెప్పించారు.బడ్జెట్‌ విషయంలో తాను ఎలాంటి నిబంధనలు పెట్టలేదని చెప్పారు.ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌గా 'కల్కి 2898ఏడీ' తెరకెక్కింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ జూన్‌ 27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌, ఆయన టీమ్‌ పార్ట్‌-2 స్క్రిప్ట్‌ను పూర్తి చేసేపనిలో ఉందని చెప్పారు .ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వనీదత్, రాజమౌళితో సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నం1 సినిమాకు నేను ప్రజంటర్‌గా వ్యవహరించాను. తొలి మూవీ అయినప్పటికీ ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ ఉంది’’ అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: