జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా తీసిన సినిమా దేవర. ఈ సినిమా మొన్న శుక్రవారం రోజున రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా థియేటర్లలో నడుస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 300 కోట్ల వరకు రాబట్టగలిగింది దేవర సినిమా. రిలీజ్ అయిన మొదటి రోజు మధ్యాహ్నం వరకు దేవర సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సాయంత్రం వరకు పాజిటివ్ టాక్ తెచ్చుకొని... కలెక్షన్లలో దుమ్ము లేపుతోంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ రావడం జరిగింది.


అటు కొరటాల శివ కూడా మంచి కాక మీద ఉన్నాడు. ఈ తరుణంలోనే దేవర సినిమా మంచి.. కలెక్షన్లతో ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయింది పార్ట్ వన్ మాత్రమే. దేవర పార్టు 2 కూడా ఉంటుంది. అయితే దేవర పార్ట్ వన్ లో.... చాలా సన్నివేశాలు అలాగే పాత్రల విషయాలు... సస్పెన్స్ గానే ఉంచారు కొరటాల శివ. సినిమా ప్రారంభంలో దయ అలాగే యతి గురించి పోలీసులు ఎంక్వైరీ చేసినట్లు ముందు చూపించారు.


కానీ వాళ్ల గురించి సినిమాలో ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో ఒకరు.. బాబీ డియోల్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనిపై దేవర రెండవ భాగంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి తీసుకువచ్చిన జాన్వి కపూర్... పాత్రను పూర్తిగా తీసేశారు. ఆమె సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఎందుకలా జాన్వి కపూర్ పాత్రను తగ్గించారు అనేది కూడా పార్ట్ 2 లో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దేవర రెండవ భాగంలో జాన్వి కపూర్  కీ రోల్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి.


అలాగే ట్రైలర్ తో పాటు సినిమాలో.. సముద్రంలో... కొంతమంది అస్తిపంజరాలు మనకు కనిపిస్తాయి.  వాటి వెనుక ఉన్న మిస్టరీ మాత్రం రివీల్ చేయలేదు. బైరా కొడుకు, శ్రీకాంత్ బ్యాగ్రౌండ్  అంతేకాకుండా దేవర చెల్లెల గురించి పైన పైన చెప్పారు. వీళ్ళ గురించి రెండవ భాగంలోనే పూర్తిగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎందుకు భయస్తుడుగా ఉంటాడు...  తన తండ్రి మరణం వెనుక అసలు కథ ఏంటి? ఏ విధంగా ఎన్టీఆర్ తెలుసుకుంటాడు  అనే విషయాలను కూడా దేవర రెండవ భాగంలో కొరటాల శివ క్లారిటీగా  చూపించే ఛాన్స్ ఉంది. మొత్తానికి చాలా మిస్టరీలు.. దాచేసిన కొరటాల శివ పార్ట్ వన్ రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: