నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ఈ మూవీ లో బాలయ్య కి జోడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే బాలయ్య అహ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాప్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అన్ స్టాపబుల్ లేటెస్ట్ సీజన్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ షూటింగ్ లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు స్టార్ట్ కాబోయే ఈ సీజన్ షూటింగ్లో లక్కీ భాస్కర్ సినిమాలో హీరోగా నటిస్తున్న దుల్కర్ సల్మాన్ , అలాగే ఈ మూవీ ని నిర్మిస్తున్న సూర్య దేవర నాగ వంశీ , ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

లక్కీ భాస్కర్ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: