టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించగా ... మురళీ శర్మమూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ ని గత కొన్ని రోజులుగా తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా అదే జోష్ ను చూపిస్తోంది.

ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా నాని బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా సరిపోదా శనివారం సినిమాతో ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: