యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 వ తేదీన అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీ రిలీస్ కాబోతున్నాయి. మరి ఆయన నటించిన ఏ సినిమాలు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రీ రిలీస్ కాబోతున్నాయి ..? అవి ఏ తేదీన రీ రిలీజ్ కానున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ , కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఆసిన్ , ఛార్మి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను అక్టోబర్ 2 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కాజల్ , తాప్సి ఈ మూవీలో హీరోయిన్లుగా నటించగా ... దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని అక్టోబర్ 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన డార్లింగ్ మూవీ ని అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ "ఈశ్వర్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలబడింది.

ఇలా ప్రభాస్ నటించిన ఈ నాలుగు సినిమాలు ఈ అక్టోబర్ నెలలో రీ రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చేసాయి. మరి ఈ లిస్టులోకి మరిన్ని సినిమాలు చేరుతాయి ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: