* విలన్ అవుదామని వచ్చి కమెడియన్ గా సెటిల్ అయిన సునీల్
* టాలీవుడ్ టాప్ కమెడియన్ గా 100 కు పైగా చిత్రాలు
*హీరోగా అలరించిన..కమెడియన్ గా నవ్వించిన..విలన్ గా బెదిరించిన సునీల్ కే సాధ్యం..
సునీల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాప్ కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు..అసలు సునీల్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలానే కష్టపడ్డారు..సునీల్ కు చిన్నప్పటి నుండి హీరో కావాలనే లక్ష్యం బలంగా ఉండేది..తన ఊహ తెలిసాక తన అందానికి హీరో అంటే జనాలు చూస్తారా అనే అనుమానంతో బెస్ట్ విలన్ గా రానించాలని అనుకున్నారట..సునీల్ కు చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే వీరాభిమానం.. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు క్యూ లైన్ లో టికెట్స్ కోసం ఒక యుద్ధమే చేసేవారట.. సునీల్ కు చిరంజీవి డాన్స్ అంటే పిచ్చ ఇష్టం.. ఆయనలాగా డాన్స్ వేయాలని సునీల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కూడా చేరారు..సినిమాలలో రానించాలనే లక్ష్యంతో 1994 లో హైదరాబాద్ వచ్చారు..అయితే హైదరాబాద్ వచ్చేందుకు సునీల్ ఏకంగా తన బైక్ ని అమ్ముకొని ఆ డబ్బుతో అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగేవారు.ప్రస్తుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో కలిసి సునీల్ రూమ్ షేర్ చేసుకొని వుండేవారు.దీనితో త్రివిక్రమ్, సునీల్ మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది..
దాదాపు 100 కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించిన సునీల్ 2006 లో ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత కూడా సునీల్ కమెడియన్ గా నటించారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో సునీల్ కు హీరోగా అవకాశం వచ్చింది.అదే ‘మర్యాదరామన్న’ సినిమా.. ఈ సినిమా సునీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. దీనితో హీరోగా రానించాలని ఫిక్స్ అయ్యాడు..మర్యాద రామన్న తరువాత సునీల్ నటించిన ‘పూల రంగడు’ కూడా మంచి విజయం సాధించింది.. కానీ ఆ తరువాత చేసిన వరుస సినిమాలు సునీల్ కి కలిసి రాలేదు.. దీనితో సునీల్ మళ్ళీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు.. సెకండ్ ఇన్నింగ్స్ లో తన డ్రీమ్ రోల్స్ అయిన విలన్ గా నటించడం మొదలు పెట్టారు.. పుష్ప సినిమాలో మంగళం శీను పాత్ర సునీల్ కు విలన్ గా మంచి పేరు తెచ్చింది.. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో సునీల్ అన్ని ఇండస్ట్రీ ల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.. దీనితో సునీల్ విభిన్న పాత్రలతో అద్భుతంగా రానిస్తున్నారు.