- రౌడీ స్టార్ అంటూ పిలుస్తున్న ఫ్యాన్స్..
- సినీ బ్యాగ్రౌండ్ లేకుండా బలమైన హీరోగా విజయ్ దేవరకొండ..
ఇండస్ట్రీలో ఎక్కువగా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో హీరోయిన్లు మాత్రమే రాణిస్తూ ఉంటారు. అలా వారి తాతలు తండ్రుల బ్యాగ్రౌండ్ పట్టుకొని ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్లుగా ఎదిగారు. అలా ఎదగడం పెద్ద గొప్పేమీ కాదు కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి అన్ని పరిస్థితులను నిలదొక్కుకొని స్టార్లుగా ఎదిగిన హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అలాంటి దేవరకొండ యొక్క సినీ ప్రస్థానం ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బ్యాక్ గ్రౌండ్ లేని రౌడీ హీరో:
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లలో 80 శాతం మంది వారసత్వం మీద వచ్చిన వారే. ఎంతో కాంపిటీషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో కామన్ గా వచ్చిన హీరోలు తట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఆ ఘనతను సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీ ఆయనను ఓవర్ నైట్ లోనే రౌడీ హీరోగా మార్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన గీత గోవిందం మూవీ తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ విధంగా రౌడీ హీరోగా పేరు తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ. మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. చిన్నచిన్న పాత్రలతో మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ 2011 లో వచ్చినటువంటి రవిబాబు నువ్విలాలో ప్రాధాన్యత లేని పాత్రలో నటించాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో చేశాడు. ఇక విజయ్ దేవరకొండను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం.