ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ వరగ్గాలు అతడి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం కలక్షన్స్ తో దూసుకుపోతున్న ‘దేవర’ మూవీలో ఆనుక్షణం స్వార్థంతో రగిలిపోయే ప్రతి నాయకుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ నటనకు టాలీవుడ్ ప్రముఖుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో జూనియర్ కు సవాల్ విసిరే పాత్రలో సైఫ్ నటన చూసి ఈమూవీని చూసిన ప్రేక్షకుడు ఫిదా అవుతున్నాడు. దీనితో సైఫ్ రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ‘దేవర’ లో నటించినందుకు అతడికి 13 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో ఈ రేంజ్ లో పారితోషికం సైఫ్ కు ఇవ్వాలి అంటే మీడియం రేంజ్ నిర్మాతలకు జరగని పని అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘దేవర’ పార్ట్ 2 విషయమై కొరటాల ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీక్వెల్ విషయంలో జూనియర్ సైఫ్ ఇంకా తన అంగీకారం తెలపలేదు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకుతోడు సైఫ్ రూపంలో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికినప్పటికీ మీడియం రేంజ్ సినిమాలను తీసే నిర్మాతలు అతడిని తట్టుకోవడం కష్టం అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.  

‘దేవర’ మూవీలో నిండైన విగ్రహంతో సైఫ్ ఇచ్చిన భావ ప్రకటనతో సైఫ్ హవా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ‘దేవర’ చూసిన ప్రేక్షకులు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ దొరికాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీనితో సైఫ్ నిజంగా ఏవిలన్ కు పోటీ అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూసిన వారు మాత్రం సైఫ్ మ్యానియా మరికొన్నాళ్ళు కొనసాగే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: