సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ ఎన్నో విజయాలను అందుకున్న కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకని తమిళ శని పరిశ్రమలో తనకంటూ ఒక మంచి నటుడుగా గుర్తింపును సంపాదించుకొని మంచి జోష్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. అలాగే కార్తీ తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే కార్తీ స్టార్ హీరోలతో పోటీ పడడంలో ముందు వరుసలో ఉంటాడు. భారీ అంచనాలు ఉన్న స్టార్ హీరోల సినిమాలకి చిన్న సినిమాతో పోటీగా వచ్చి మంచి విజయాలను అందుకున్న సందర్భాలు కూడా కార్తీ కెరియర్ లో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా రూపొందిన బిగిల్ సినిమా విడుదల అయిన రోజే కార్తీ హీరోగా రూపొందిన ఖైదీ మూవీ కూడా విడుదల అయింది. విడుదలకు ముందు బిగిల్ సినిమా ముందు ఈ మూవీ నిలబడడం కష్టం అనే వాదనను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ఖైదీ మూవీ అద్భుతమైన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా కార్తీ "సత్యం సుందరం" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ విడుదల కంటే ఒక రోజు ముందు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ విడుదల అయింది. ఈ మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అయింది. దేవర ముందు ఈ సినిమా నిలబడడం కష్టం అని చాలా మంది ఆలోచనలను వ్యక్తం చేశారు. కానీ సత్యం సుందరం మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొంది. తనితో ప్రస్తుతం ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: