టాలీవుడ్ ఇండస్ట్రీలో వెళ్లిపోమాకే అనే సినిమాతో విశ్వక్ సేన్ కెరీర్ మొదలైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా విశ్వక్ సేన్ కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ నగరానికి ఏమైంది సినిమాతో విశ్వక్ సేన్ కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఫలక్ నుమా దాస్, హిట్1 సినిమాలు కమర్షియల్ హీరోగా విశ్వక్ సేన్ కు గుర్తింపును తెచ్చిపెట్టాయి.
 
ఈ సినిమాలతో విశ్వక్ సేన్ కు మాస్ ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయిం సైతం పెరిగిందనే చెప్పాలి. పాగల్ సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నా అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా సినిమాలతో విశ్వక్ సేన్ సత్తా చాటారు. దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకోవడం గమనార్హం.
 
ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, లైలా సినిమాలలో నటిస్తుండగా ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పలు వివాదాల ద్వారా, విమర్శల ద్వారా విశ్వక్ సేన్ వార్తల్లో నిలిచారు. అయితే విశ్వక్ సేన్ తప్పు లేకపోయినా చాలా సందర్భాల్లో ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఆ వివాదాలలో విశ్వక్ సేన్ తప్పు లేదని మెజారిటీ సందర్భాల్లో ప్రూవ్ అయింది.
 
విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 7 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ప్రూవైంది. విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా కథల ఎంపికలో విశ్వక్ సేన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తను హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలకు సీక్వెల్స్ సైతం ఉంటాయని విశ్వక్ సేన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: