తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సెలెబ్రెటీలు, యూట్యూబర్లగా కొనసాగుతున్న వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దిగ్గజ దర్శకులపై కూడా లైంగిక ఆరోపణలు రావడం పెద్ద సంచలనం రేగింది. ఒక సెలబ్రిటీ బాగోతం బయటపడి అది హాట్ టాపిక్ గా ఉన్న సమయంలోనే మరో సెలబ్రిటీ బాగోతం వెలుగులోకి వస్తూ అందరినీ పెద్ద షాకీ గురి చేస్తోంది. ఇండస్ట్రీలో మంచి ఇమేజ్, పేరు తెచ్చుకున్న వారే ఇలాంటి నీచపు పనులు ఎలా చేశారు అని ప్రజలు షాక్ అవుతున్నారు. ఈ ఆరోపణల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ ఇన్నాళ్లుగా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట అంతా ఒక్కసారిగా మంట గలిసి పోతుంది. రీసెంట్ టైంలో అలా పరువు పోగొట్టుకున్న సినీ సెలబ్రిటీస్, స్టార్ యూట్యూబర్లు ఎవరో తెలుసుకుందాం.
* జానీ మాస్టర్:
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కింద పని చేసే లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై లైంగిక వేధింపుల కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ తనని పదహారేళ్ళ వయసు నుంచే అత్యాచారం చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. అంతేకాదు జానీని అరెస్టు చేసే చంచల్‌గూడా జైల్‌కు తరలించారు. ఇప్పటికీ ఆయన పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు.

ఇండియా వైడ్ గా స్టార్ హీరోలకు అదిరిపోయే డాన్స్ స్టెప్పులు నేర్పించాడు జానీ. ఆయన కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. జాతీయ అవార్డు పొందిన తొలి సౌత్ ఇండియన్ కొరియోగ్రాఫర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు జానీ పై రేప్ అలిగేషన్స్ రావడంతో అతడి ఇమేజ్ మొత్తం పోయింది.
•  యూట్యూబర్ హర్ష సాయి
 పేద ప్రజలకు ఆర్థిక సహాయాలతో పాటు ఎన్నో సహాయాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు యూట్యూబర్ హర్ష సాయి. ఇతడిపై కూడా లైంగిక ఆరోపణలు రావడంతో చాలామంది షాక్ అయ్యారు. ఈ యూట్యూబర్ రూ.2 కోట్లు తీసుకొని మోసం చేశాడని, తనను న్యూడ్ గా ఫోటోలు తీసి ఆపై బెదిరించి రేప్ చేశాడని ఓ బాధితురాలు పోలీస్ మెట్లు ఎక్కింది. ఆమె అతని తొలి సినిమాలో నటించిన హీరోయిన్ అని తర్వాత తెలిసింది.

యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బును పేదవారికి ఇస్తూ దానకర్ణుడిగా హర్ష పాపులరయ్యాడు. కానీ ఎవరికి తెలియని ఒక దుర్మార్గుడు కూడా అతనిలో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం హర్ష పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అతని కోసం పోలీసులు గాలింపు కూడా చేపట్టారు.

* సింగర్ మల్లిక్

 ప్రముఖ యూట్యూబర్, పాపులర్ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ కూడా ఓ రేప్ కేసు రిజిస్టర్ అయింది. అతడు మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పోలీసుల ఎదుట ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆమె తన కంప్లైంట్ లో మల్లిక్ బ్లాక్‌ మెయిల్‌ చేసి పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని, తన కుటుంబ సభ్యులను కూడా బూతులు తిట్టాడని ఫిర్యాదులో రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: