•ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు కానీ భారీ సక్సెస్


•లైట్ బాయ్ కోసం ప్రతి ఏటా అలాంటి పని

•ఊరినే దత్తత తీసుకున్న ఘనత..




తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడుగా  పేరుపొందిన రాజాబాబు ఎన్నో చిత్రాలలో తన హాస్య నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ఆయన లేని సినిమా అంటూ ఏదీ ఉండేది కాదు అప్పట్లో. అందుకే రాజా బాబు ఎన్నో చిత్రాలలో విసుగు విరామం లేకుండా రాత్రి పగలు కష్టపడి మరి నటించేవారట. రాజబాబు ఒక పొజిషన్ చేరుకునే వరకు చాలా కష్టపడ్డాడు.. అయితే ఆ తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడ్డారట. ఆ రోజుల్లో రాజబాబు ఎలాంటి సన్నివేశాలలో నటించినా కూడా అది ప్రేక్షకులను నవ్వించేలా ఉండేది.


రోజుకి మూడు సినిమాలు షూటింగ్ చేస్తూనే.. 13 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారట. ఏఎన్ఆర్,  ఎన్టీఆర్,  కృష్ణ ,శోభన్ బాబు ఇలా ఎంతోమంది హీరోల చిత్రాలలో కూడా కమెడియన్ గా నటించారు రాజబాబు. ఆయన కోసం కొంతమంది హీరోలు ఏకంగా సినిమా షూటింగ్లలో ఎదురు చూసే వారే కాకుండా, డేట్లను కూడా అడ్జస్ట్ చేసుకునేవారట. రాజబాబు గుణం ఎంత మంచిదో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు.. అదేమిటంటే రాజాబాబు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో కొన్ని చిత్రాలలో నటిస్తున్న సమయంలో ఒక లైట్ బాయ్ తన దగ్గరికి వచ్చి సార్ మీరు బాగా చేశారు మీరు కచ్చితంగా పైకి వస్తారు అప్పుడు నాకు బట్టలు పెట్టాలి సార్ అని చెప్పారట..


అయితే రాజబాబు నటించిన ఆ సినిమా కూడా మంచి విజయం అవ్వడంతో ఆ లైట్ బాయ్ అన్న మాటలు మరిచిపోకుండా అతడికి చెప్పిన ప్రకారం బట్టలు పెట్టాలని చాలానే వెతికారట కానీ ఆయన ఎవరో తెలియకపోవడంతో ఆ రోజు నుంచి తను సినీ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు లైట్ బాయ్ గా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ తన పుట్టినరోజు సందర్భంగా మద్రాస్ కు వెళ్లి మరి స్టూడియోలో బట్టలు పంచేవారట అలాగే బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇచ్చే వాళ్ళని రాజబాబు తెలుస్తోంది.

రాజబాబు 514 చిత్రాలలో నటించడమే కాకుండా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హాస్యనటుడుగా పేరుపొందారు. అలాగే మూడుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. అయితే ఆయనకు గొంతు క్యాన్సర్ ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొద్ది రోజులకే స్వర్గస్తులైనట్టు సమాచారం. అయితే ఆయన మరణించే సమయానికి ఆయన నటించిన తొమ్మిది చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయట. నిజానికి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నటించాలని ఒక కోరికతో ఏకంగా 500కు పైగా చిత్రాలలో నటించి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలలో సక్సెస్ అవ్వడమే కాదు తన సొంత ఊరికి ఎన్నో రకాలుగా ఆదుకున్నారు కూడా. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆ ఊరి గ్రామస్తులు ప్రత్యేకంగా విగ్రహ ప్రతిష్ట చేసి ఆయన పుట్టిన రోజు నాడు వేడుకలు జరుపుకుంటారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: