నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు . కొంత కాలం క్రితం పాటు వరస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఈ సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

కొంత కాలం క్రితం బాలయ్య , అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోకుండా ఇతరుల సినిమాలకు కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటాడట.

అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ఓ హీరో సినిమాకు శ్రీదేవి ని హీరోయిన్గా అనుకోగా , ఆమెను పెట్టుకోకండి , ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పాడట. వినకుండా ఆ మూవీ బృందం సినిమాకు హీరోయిన్గా శ్రీదేవి ని ఫిక్స్ చేయగా ఆ మూవీ బ్లాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యిందట. అలా బాలయ్య మాట వినకుండా శ్రీదేవిని హీరోయిన్గా పెట్టుకోవడం వల్ల ఈ స్టార్ హీరోకు ఓ ప్లాప్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: