ఆమె మరెవ్వరో కాదు, తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన రాధికా శరత్ కుమార్. అవును, ఆమె సినిమా వచ్చిందంటే చాలు.. 90s కిడ్స్ థియేటర్లకు క్యూలు కట్టేవారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ అంటే ప్రేక్షకులు కోసుకొనేవారు. ఈ హీరోయిన్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండేవారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది ఈ స్టార్ హీరోయిన్ రాధిక. తెలుగుతో పాటు రాధిక అనేక తమిళ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
అలాంటి ఆమె వైవాహిక జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. రాధికా 3 పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకున్న రాధిక ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోగా తరువాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఎక్కువ కాలం కలిసుండలేకపోయారు. ఆ తరువాత శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది రాధిక. ఇక శరత్ కుమార్‌కు అంతకు ముందే పెళ్ళైనప్పటికీ కూడా రాధికతో ప్రేమలో పడి మరీ రెండో వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు రాధిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు అని అందరికీ తెలిసినదే. ఇక సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు ఈ నటి. ఇక ఈ వయస్సులో కూడా ఆమె ఇప్పుడు తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు.