జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. విడుదల అయిన 3 వ రోజు ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. రిలీజ్ అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సినిమాల లిస్టులో దేవర అదిరిపోయే రేంజ్ స్థానాన్ని దక్కించుకుంది.

విడుదల అయిన మూడవ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఆర్ ఆర్ ఆర్ మూవీ 33.53 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , సలార్ మూవీ 22.40 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , కల్కి 2898 AD సినిమా 19.83 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలవగా , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.03 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. ఇలా దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 3 రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.

మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించి రెండు పాత్రలలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... శ్రీకాంత్ , మురళీ శర్మ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: