ఇక ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సుజాత. టాలీవుడ్ లో చెదిరిపోని ముద్ర వేసుకున్న నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల్లో ఈమె 300 కు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డును క్రియేట్ చేసుకుంది. హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత అక్క ,అమ్మ ఇలా ఏ పాత్ర ఇచ్చిన తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కలిసి నటించిన ప్రేమ తరంగాలు సినిమాలో సుజాత చిరంజీవికి లవర్ గా నటించింది. అంతేకాకుండా ఆ సినిమా చివరిలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. ఈ మూవీ హిందీలో సూపర్ హిట్ అయిన ముకద్దర్ కా సికిందర్ సినిమాకు రీమేక్‌గా ప్రేమ తరంగాలను తెలుగులో తెరకెక్కించారు.
ఈ సినిమా వచ్చిన రెండు సంవత్సరాలకి సీతాదేవి అనే సినిమాలో సుజాత చిరంజీవికి చిల్లిగా నటించింది. అలాగే 1995లో సీనియర్ దర్శకుడు విజయ్ బాపినీడు తెరక్కించిన బిగ్‌బాస్ సినిమాలో సుజాత చిరంజీవికి తల్లిగా నటించింది. ఇలా ప్రియురాలు, చెల్లి, తల్లి పాత్రలో చిరుతో కలిసి నటించింది ఈవిడ ఒక్కరే. ఇక ఈమే తన కెరీర్లో స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరితో నటించింది. ఇక చివరి వరకు సినిమాలో నటించిన సుజాత 2011 ఏప్రిల్ 6న కన్ను మూసింది.