టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం దేవర.
ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుంది. గత మూడు రోజుల నుంచి ఈ సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురుస్తోంది. మొదటి రోజు ప్రీ బుకింగ్స్ భారీగా జరిగాయి. థియేటర్లోకి వచ్చిన తర్వాత మూడు రోజులు భారీగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. కాగా, జాన్వి కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అందులో ఓ విషయం గురించి మాట్లాడుతూ.... నేను జుట్టు లేకుండా నటించాల్సి వస్తే అసలు నటించను. అలాంటి పాత్రను నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఎంత కష్టమైనా భరిస్తాను కానీ జుట్టు మాత్రం కట్ చేసుకోనని చెప్పుకురావడం జరిగింది. నా మొదటి సినిమా ధడక్ సినిమా కోసం కొంచెం జుట్టు కట్ చేశాను. అప్పుడు అమ్మ కోపగించింది. ఏ పాత్ర కోసమైనా సరే జుట్టును మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. ఆమె మాట నేను అస్సలు దాటను. అందుకే జుట్టు లేకుండా ఉండే పాత్రలు వస్తే చేయను అని క్లారిటీ ఇచ్చింది.
దీంతో తన దగ్గరికి సినిమా చేయమని వస్తే అందులో జుట్టు కట్ చేసుకోవాలని చెప్పే పాత్రలతో అస్సలు నా వద్దకు రావద్దు అంటూ డైరెక్ట్ గానే దర్శక నిర్మాతలకు జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది. దేవర సినిమా తర్వాత జాన్వి, రామ్ చరణ్ తో ఆర్సీ16 సినిమా చేయబోతోంది. బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం జాన్వీకపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.