యూట్యూబ్ లో నిత్యం వినిపించే పేరు హర్షసాయి. ఇతడు యూట్యూబ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా హర్షసాయిపై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి తనని లైంగికంగా వేధించడంతోపాటు బెదిరిస్తున్నాడు అంటూ ఓ యువతి పోలీసులను సంప్రదించింది. హర్షసాయిపై రేప్ కేసు నమోదు అయ్యి వారం రోజులు అవుతుంది. దీంతో నార్సింగి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.


అయితే హర్షసాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకొక ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. దీంతో అతడిని త్వరగా అరెస్టు చేయాలని బాధితురాలు కోరుతోంది. హర్షసాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేసింది బాధితురాలు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా బాధితురాలు విజ్ఞప్తి చేసింది. దీంతో హర్షసాయి జాడ కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నారు నార్సింగి పోలీసులు.


స్పెషల్ టీం ను కూడా రంగంలోకి దింపారు. అయినా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను ఇట్టే అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు మరి హర్షసాయి విషయంలో ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇతని గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో తెలియని వారంటూ ఉండరు. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో వార్తల్లో నిలిచాడు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చేయడమే కాకుండా పేదలకు సహాయం చేస్తూ విపరీతంగా పాపులర్ అయ్యాడు.


పేదలకు డబ్బు సాయం చేయడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ కేసు నుంచి బయటపడేందుకు విదేశాల్లో ఉన్న నా అన్వేషణ అవినాష్ ను హర్షసాయి కలిసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: