మూడు దశాబ్దాల క్రితం మోస్ట్ వాంటెడ్ హీరో సుమన్ తల్వార్. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్ తల్వార్. అతని డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు. ఈ హీరో ఎంతో అందంగా ఉండేవాడు. అంతే కాకుండా కరాటే ఫైటర్ కావడంతో అతనితో సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు. ఫ్యామిలీ కథలు, యాక్షన్ సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు పోటీపడేవారు.
హీరో సుమన్ ది ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలను దీటుగా ఎదుర్కొని తన యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను కొన్ని సంవత్సరాల పాటు అలరించాడు. ఆయన కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సుమన్ మెల్లమెల్లగా సినిమాలకు దూరమయ్యాడు. అతనికి సినిమా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే కొంతమంది స్టార్ హీరోలు అతడిని కావాలనే తొక్కేసారని ఓ కేస్ లో ఇరికించారని ప్రచారాలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
ఈ హీరో సుమన్ రీల్ హీరో మాత్రమే కాదు. రియల్ హీరో అని కొన్ని సందర్భాలలో నిరూపించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 175 ఎకరాల భూమిని జవాన్లకు డొనేట్ చేసి అప్పట్లో తన మంచి మనసును చాటుకున్నాడు. తన భార్య కోరిక మేరకు కార్గిల్ లో పోరాడిన సైనికుల కోసం 175 ఎకరాల్లో కొంత భూమిని విరాళంగా ఇవ్వాలని అనుకున్నాడు. ఆ భూమిలో కొంత కొండలు, గుట్టలు కూడా ఉన్నాయి.
అది కాకుండా మంచి స్థలాన్ని సైనికులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సుమన్ తెలిపారు. కానీ ఊహించని విధంగా ఆ స్థలం వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. వివాదాలు తొలగిపోయి మాకు అనుకూలంగా తీర్పు వస్తే సైనికుల కోసం మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని సుమన్ తెలిపాడు. ఆ ల్యాండ్ కి డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం వల్ల ఈ వివాదం నెలకొందని సుమన్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.