మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. రికార్డులు బ్రేక్ చేయడం ఎన్టీఆర్‌కు కొత్త ఏమీ కాదు.. చిన్న వయసులోనే ఆది సినిమాతో రికార్డులు తిరగరాసిన చరిత్ర ఎన్టీఆర్ కే దక్కింది. ఆ తర్వాత మళ్లీతన రికార్డులను సింహాద్రితో తానే తిరగరాసుకున్నాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత దేవరతో పాత రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. తొలిరోజు రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టగా.. తొలి వారంలోని రూ.304 కోట్ల కలెక్షన్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ వీక్ రికార్డును  అందుకున్నాడు.

మరోవైపు యావరేజ్ టాక్ అందుకున్న వ‌సూళ్ల‌ విషయంలో ఏమాత్రం జోరు తగ్గడం లేదు. రోజురోజుకూ టాక్ మారడంతో కలెక్షన్లు కూడా భారీగా పెరుగుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ సినిమాకు ప్రమోషన్లు తక్కువే జరిగాయి.. కానీ కలెక్షన్స్ ఈ రేంజ్ లు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎన్టీఆర్ స్టార్డం ఫ్రీ రిలీజ్ బస్ ఫస్ట్ వీకెండ్ భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఆచార్యతో బోల్తా ప‌డ్డ‌ కొరటాలకు దేవర ఊపిరి పోసింది. ఇలా మూడో రోజు కూడా దేవర రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇదే విధంగా కలెక్షన్ల సునామీ రాబడుతుంటే మరో రెండు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఇక మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు అందుకొంటాడో చూడాలి.

ఇక ఎన్టీఆర్ తర్వాత సినిమాల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటిస్తున్నాడు.. అలాగే ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తున్న‌డు.. ఈ రెండు సినిమాల్లో ముందుగా వచ్చే సంవత్సరం ఆగస్టులో వార్‌2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే డిసెంబర్లో ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. వీటితోపాటు దేవర2 షూటింగ్ కూడా జరగనుంది. విరితోపాటు ఎన్టీఆర్‌తో సినిమాలు చేయటానికి సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ వంటి వారు కూడా రెడీగా ఉన్నారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ దేవర ప్రెస్ మీట్ లో భాగంగా తమిళ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ తో తనకు సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఆయన కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ వరుస సినిమాలతో ప్రజెంట్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: