చిరంజీవి : తెలుగు చిత్ర పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను క్రియేట్ చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతోమంది నటులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి చిరంజీవి తన కెరియర్ మొదట్లో పలు సినిమాల్లో విలన్ గా నటించారు. అలా చిరు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోగా మారి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకే గాడ్ ఫాదర్గా నిలిచాడు.
మోహన్ బాబు : కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు ఇప్పటికి 500 పైగా చిత్రాలలో నటించాడు. వాటిల్లో హీరో, విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి. చిరంజీవి బాటలోనే మోహన్ బాబు కూడా ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించాడు.
రజనీకాంత్ : ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా కొనసాగుతున్న రజనీకాంత్ కథ సంగమం, జాను, బాలు వంటి సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్నాడు.
రాజశేఖర్ : టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా స్టార్ హీరోగా హవా నడిపించిన రాజశేఖర్ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అబ్బాయిగారు.. వారసుడు లాంటి సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాతే హీరోగా కెరియర్ మొదలుపెట్టారు. వీరు మాత్రమే కాకుండా సీనియర్ నటుడు శ్రీకాంత్ శ్రీహరి రవితేజ గోపీచంద్ లాంటి వారు కూడా ముందుగా విలన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా ఎదిగి అగ్ర హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.