సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు ప్రతి సినిమాకి మేకోవర్ని మారుస్తూ ఉంటారు. ముఖ్యంగా స్లిమ్ గా ఉన్నోళ్లు.. లావుగా, లావుగా ఉన్నవారు స్లిమ్ముగా మారిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంత మంది సినిమాలలోని పాత్రల కోసం పలు రకాల సాహసాలు చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన ఒక నటి పలు చిత్రాలలో స్పెషల్ సాంగులలో నటించడమే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం హాట్ ఫోటోలతో హీటెక్కిస్తూ అవకాశాల కోసం పరితపిస్తూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు రాంగోపాల్ వర్మ హాట్ బ్యూటీగా పేరుపొందిన అప్సరా రాణి.


లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఎక్కువగా నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోలీస్ దుస్తులలో కనిపిస్తూ గన్ను పట్టుకొని పలు రకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో పోలీస్  దుస్తులలో అప్సర రాణిని  గుర్తుపట్టడం చాలా కష్టం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హెయిర్ కటింగ్ కూడా చాలా చిన్నగా ఉండడమే కాకుండా స్లిమ్ముగా తయారయి మరింత అందంగా కనిపిస్తోంది.


అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు తమిళ చిత్రం  అయినా బ్లడ్ రోజెస్ అనే చిత్రంలో ఇమే నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోని ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ పాత్ర అన్నట్లుగా సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన స్టిల్స్ ని సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిందని వాటికి సత్యమేవ జయతే అని ఒక క్రేజీ క్యాప్షన్ సైతం జత చేసి మరి ఈ ఫోటోలను షేర్ చేసింది. గతంలో చాలా బోల్డ్ గా హార్ట్ గా కనిపించిన అప్సర రాణి ఇలా ఒక్కసారిగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. మరి వర్మ సపోర్ట్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: