మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.. ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్న రామ్ చరణ్ ఈ జంటకు దాదాపుగా పదేళ్ల తర్వాత క్లింకార పాప జన్మించింది. అయితే ఈ పాప జన్మించినప్పటి నుంచి ఇప్పటివరకు తన పేస్ ను మాత్రం పూర్తిగా రివీల్ చేయలేదు మెగా కుటుంబం. దీంతో రామ్ చరణ్ కూతురు మెగా వారసురాలు ఎలా ఉంటుందో చూడాలంటే అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు పూర్తి ఫేస్ని సైతం రివీల్ చేసినట్లు కనిపిస్తోంది.


ఎల్లో అండ్ పింక్ కలర్ గుర్రపు బొమ్మ పైన కూతురుతో ముద్దాడుతో కూర్చున్న రామ్ చరణ్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అలాగే తన కూతురు క్లింకారా  కూడా రామ్ చరణ్ ముక్కు పైన చేయి పెట్టి మరి తన తండ్రితో ఆటలాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు కూడా తన కూతురికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. క్లింకారా ఫేస్ నైతే పూర్తిగా చూపించలేదు కానీ సైడ్ నుంచి కాస్త ఫోటోలను చూపించినట్టుగా కనిపిస్తోంది.


ఇన్ని రోజుల తర్వాత మెగా కుటుంబ సభ్యులు ఈ ఫోటోని విడుదల చేయడంతో అభిమానులు ఆనంద పడుతున్నారు మరి కొంతమంది ఈ ఫోటోలకు లవ్ సింబల్స్ ని జోడిస్తూ వైరల్ గా చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం అక్కడ ఉన్నది క్లింకారా కాదని తన చెల్లెలు సిస్టర్ ఏమో అన్నట్టుగా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పైన రామ్ చరణ్ క్లారిటీ ఇస్తారా లేకపోతే ఫెస్టివల్ కి ఏవైనా ఫోటోలు షేర్ చేస్తారేమో చూడాలి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ల కోసం అభిమానులు ఎదురు చూడగా.గడిచిన కొన్ని నిమిషాల క్రితం పాటను కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: