సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతోమంది కొత్త హీరోయిన్లను లాంచ్ చేసింది. వారిలో కొద్దిమంది మాత్రమే బాగా సక్సెస్ అయ్యి సినిమాల్లో ఎక్కువ కాలం రాణించారు. మరి కొంత మంది మాత్రం ఒకటో రెండో సినిమాల్లో మెరిసి తర్వాత కనిపించకుండా పోయారు. అరెరే ఈ హీరోయిన్ మస్తుంది, మళ్ళీ ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ప్రేక్షకులు వారి కోసం చాలా వెయిట్ చేస్తుంటారు.కొంతకాలానికి వారిని పూర్తిగా మర్చిపోతారు కూడా. అప్పుడు ఈ స్పెషల్ మీడియాలోనూ లేదంటే ఏదైనా టీవీ ఛానల్ లోనూ ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. కొంతమంది అప్పట్లో ఎలా అందంగా ఉన్నారో అలాగే అందంగా కనిపించి తమవైపు తిప్పుకుంటారు మరి కొంతమంది మాత్రం అందజేసినంగా మారతారు అయితే రీసెంట్ గా ఒక మాజీ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ముద్దుగుమ్మ సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పుడు ఎంత అందంగా ఉందో అంతకుమించి ఇప్పుడు అందంగా కనిపిస్తోంది.

ఆమె మరెవరో కాదు యాక్షన్ హీరో విశాల్ హీరోగా వచ్చిన "భరణి" సినిమా హీరోయిన్. ఇది తమిళ, తెలుగు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా హీరోయిన్ తన బబ్లీ లుక్స్, ఆకట్టుకునే స్మైల్ తో ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఈ వయ్యారి భామ పేరు ముక్త. ముక్త మలయాళం, తమిళ సినిమాల్లో బాగానే నటించింది. మరి ఎక్కువ సినిమాలు చేయలేదు అలాగని మరీ తక్కువ సినిమాలు చేయలేదు. పలు సినిమాలతో కుర్రాళ్ళ మనసులో డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.

 ఈ కేరళ కుట్టి 2005లో "ఓట్ట ననయం" సినిమాతో హీరోయిన్ గా సినిమాల్లో అడుగుపెట్టింది. ఆపై మరో మలయాళం సినిమాలో నటించింది. తర్వాత స్ట్రైట్  తెలుగు సినిమా అయిన "ఫోటో"లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఇది పెద్దగా హిట్ కాలేదు. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆమె తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. 2015లో సింగర్‌ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లి చేసుకుంది. 2017 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ముక్త ఇప్పుడు ఎలా ఉంది.? అని నెటిజన్స్ సోషల్ మీడియాను చాలా రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముక్త లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలో ఆమె చాలా అందంగా కనిపించే అందర్నీ ఆశ్చర్యపరిచింది. యువ హీరోయిన్ల కంటే అట్రాక్టివ్ గా ఆమె కనిపించడం విశేషము. ఇక ముక్త కూతురు కూడా సినిమాల్లో నటిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. ఇన్నాళ్ల తర్వాత ముక్త తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: