సింహాద్రి:
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమా 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లో 175 సెంటర్లో వంద రోజులకు పైగా ఆడి... 52 సెంటర్లో 175 రోజులను పూర్తి చేసుకుని.. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
పోకిరి:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి.. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఆల్ టైం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 200 సెంటర్లో 100 రోజులు ఆడింది.. 48 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఇంద్ర:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి. గోపాల్ డైరెక్షన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ఇంద్ర.. ఈ సినిమా 2002లో విడుదలై చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 122 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా... 31 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడి.. చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం హిట్‌గా నిలిచింది.
సమరసింహారెడ్డి:
నందమూరి బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి... ఈ సినిమా 1999లోవిడుదలై బాలకృష్ణకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ఆ టైంలో 29 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడింది.
పెళ్లి సందడి:
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సినిమా పెళ్లి సందడి.. ఎలాంటి అంచనాలు లేకుండా 1996లో విడుదలైన ఈ సినిమా శ్రీకాంత్ కు ఆల్ టైం హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 27 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడింది.
నువ్వే కావాలి:
తరుణ్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా నువ్వే కావాలి..సినిమా 2000వ సంవత్సరంలో విడుదలై తరుణ్ కు అదిరిపోయే హిట్ నచ్చింది.. ఈ సినిమా ఆ టైంలోనే 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 25 సెంటర్లో 175 రోజులు ఆడి ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది.
ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమాభిషేకం.. 1981లో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 19 కేంద్రాల్లో రజితోత్సవం జరుపుకుంది.
నరసింహనాయుడు:
బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు.. 2001లో విడుదలైన ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడి బాలకృష్ణకు మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
కలిసుందాం రా:
విక్టరీ వెంకటేష్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా కలిసుందాం రా...2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే అదిరిపోయే హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా 14 సెంటర్ల 175 రోజులు ఆడింది.
లవకుశ:
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా లవకుశ.. 1963 లో మొదటి కలర్ సినిమాగా వచ్చిన లవకుశ ఆ రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. 13 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి.. ఎన్టీఆర్ రికార్డులను ఎన్టీఆర్ తిరగరాసుకున్నాడు.