తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటంలేని మహారాజు నందమూరి తారక రామారావు.. ఆయన లాంటి నటుడు రాజకీయ నాయకుడు మరొకరు రారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన నట జీవితంలో ఎన్నో  వైవిద్యమైన సినిమాల్లో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లోనే అగ్ర‌ హీరోలుగా ఉన్నారు. ఇక నట‌సింహం బాలకృష్ణ తన కెరీర్ మొదటిలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా తాతమ్మకల ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించి మరియు నటించారు. ఈ సినిమా తర్వాత వచ్చిన వాటిలో కూడా ఎన్టీఆర్- బాలకృష్ణ కలిసి నటించారు.

బాలకృష్ణ అప్పుడే టాలీవుడ్ లో తన కెరియర్ ప్రారంభిస్తున్న సమయంలో ఎన్టీఆర్ -బాలకృష్ణతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఎస్ వెంకటరత్నం అనుకున్నారట. ఆ సందర్భంలోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పారట.. కథ మొత్తం విన్న తర్వాత పాత్ర  ఎంతో వైవిధ్యమైనదని.. అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న బాలకృష్ణ ఆ పాత్రలో నటించలేడని.. ఆ పాత్ర నేను చేస్తానని  దర్శక నిర్మాతలకు చెప్పి పంపించారట. సాధారణంగా ఎవరైనా సరే కొడుకు మంచి సినిమా అవకాశం వస్తే నటింపజేయాలని చూస్తారు.. వైవిద్యమైన సినిమాలు వస్తే కొడుకు మంచి పేరు వస్తుంది కచ్చితంగా ఆ సినిమాలో తమ కొడుకుని నటింపజేయాలని దర్శక నిర్మాతలను పట్టుబడతారు. ఎన్టీఆర్ కథలో ఉన్న బలాన్ని చూసి బాలకృష్ణ చేయలేడు.. సినిమా విడుదలయ్యాక సినిమా పోతే దర్శక నిర్మాతలు ఇబ్బంది పడతారని ఎన్టీఆర్ ఆ సినిమాలో తానే నటించాడు.

1977లో  ఎన్టీఆర్  హీరోగా కైకాల సత్యనారాయణ యముడిగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన సినిమా యమగోల.. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ముందుగా బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ తో యముడు పాత్ర చేయించాలని అనుకున్నారట.. ఎన్టీఆర్సినిమా బాలకృష్ణకు వద్దని చెప్పడంతో.. సినిమాలు హీరోగా ఎన్టీఆర్ నటించాడు.. కైకాల సత్యనారాయణ తో య‌ముడి పాత్ర చేయుద్దామని దర్శక నిర్మాతులకు ఎన్టీఆర్ చెప్పాడట. తర్వాత సినిమా   షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: