టాలీవుడ్ హీరో నాని ఇటీవల కాలంలో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను మరో రేంజ్ కు తీసుకెళ్తున్నాడు. డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ హీరో మిగతా హీరోలు చేసే తప్పులను అస్సలు చేయడం లేదు. ముఖ్యంగా తన సినిమాల ప్రమోషన్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పెద్ద నగరాల్లో తన సినిమాల కోసం 2-3 రోజులు ప్రమోషన్స్‌ చేస్తున్నాడు. శక్తివంచన లేకుండా అక్కడ తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి బాగా కృషి చేస్తున్నాడు

నేచురల్ స్టార్ నాని తన సినిమాల డబ్బింగ్ వర్క్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాడు. అంటే, సినిమాలోని మాటలను మరో భాషలోకి అనువదించే పనిని చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయిస్తున్నాడు. దీని వల్ల సినిమా ఎక్కడ విడుదలైనా అది అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బింగ్ బాగుంటే ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే డబ్బింగ్ చెత్తగా ఉంటే ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేదు ఈ విషయాన్ని నాని బాగా అర్థం చేసుకున్నాడు.

కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఆయన తాజా సినిమాలు ఓటీటీలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. దీనికి కారణం ఆయన చేసే ప్రమోషన్లు మంచివిగా ఉండటమే కాకుండా, ఆయన సినిమాలు ఎవరికైనా నచ్చేలా రూపొందించడం.

నాని తన సినిమాలు ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కి కూడా నచ్చేలా చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తన సినిమాల్ని బాగా ప్రచారం చేయడం వల్ల, ఆయన లేటెస్ట్ సినిమా 'సరిపోదా శనివారం' ఇప్పుడు దేశం మొత్తం ట్రెండ్ అవుతోంది. తెలుగు సినిమా ఇంత పెద్ద స్థాయిలో హిట్ అవ్వడం చాలా అరుదు. ఓటీటీల్లో కూడా నాని సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి, ఉత్తర భారతదేశంలో ఆయనకు మంచి గుర్తింపు వస్తుంది. ఇలా ఎప్పుడూ కష్టపడితే విజయం లభిస్తుందని నాని చూపిస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలు ఒకట్రెండు సినిమాలతో నార్త్ ఇండియాలో బాగా క్రేజీ తెచ్చుకుంటున్నారు తర్వాత ఆ స్టార్డం అక్కడ పెట్టుకోలేకపోతున్నారు వారి సినిమాలు అక్కడ పెద్దగా ఆడటం లేదు. వాళ్లు కూడా నానిని చూసి నేర్చుకుని, తమ సినిమాలను బాగా ప్రమోట్ చేసుకుంటే అక్కడ కూడా తమ మూవీల మార్కెటు బాగా పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: