దర్శకుడు కొరటాల, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరు మాస్ చిత్రాల దర్శకుడు అయితే, మరొకరు మాస్ సర్కిల్స్ లో మెగాస్టార్. ఇక వీరు ఇరువురి కలయికలో 'ఆచార్య' అనే సినిమా వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలిందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాల కధనాలు వెలువడ్డాయి. ఆ సినిమాలో మెగాస్టార్ చిరు వేలు పెట్టడం వల్లనే ప్లాప్ అయిందని కొందరు భావిస్తే, మరికొందరు మాత్రం మెగాస్టార్ అలా వెలిపెడితే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యుండేదని వాదిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొరటాల దర్శకత్వంలో తాజాగా ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా రావడంతో మరలా ఆ వివాదం సోషల్ మీడియాలో చెలరేగింది.

దేవర ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు కొరటాల పక్కోడి పనిలో వేలు పెట్టకుండా.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్ అని అనగా.. ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అన్న మాటలు అని ఓ వర్గం వారు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. కట్ చేస్తే, తాజగా రిలీజైన దేవర సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో మెగాభిమానులు ఆ విమర్శలను తిప్పి కొడుతున్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ వేలుపెట్టలేదు కదా, మరి సినిమా ఎందుకు హిట్ కాలేదు? అనే ప్రశ్నలు వేస్తున్నారు. దాంతో ఈ వివాదం సోషల్ మీడియాలో పీక్స్ కి చేరింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా వేదికగా సదరు యాంకర్ చిరు వివాదం గురించి అడగగా... కొరటాల వివరణ ఇవ్వడం జరిగింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు కొరటాల. తమ మధ్య అలాంటి వివాదం ఏమీ లేదని, అనవసరంగా సోషల్ మీడియాలో ఎవరో పనికి మాలిన వాళ్లు పెట్టే పోస్టులకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు కొరటాల. "మెగాస్టార్ అంటేనే తెలుగు సినిమాకి ఓ గౌరవం.. అలాంటి మనిషి చెప్పిన సూచనలు కూడా మేము తప్పకుండా పాటిస్తాము. ఎందుకంటే అయన జడ్జ్మెంట్ చాలా సూపర్ గా ఉంటుంది. మేము నిన్న కాక, మొన్నొచ్చిన వాళ్ళము. కానీ చిరు కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నవారు. వారికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఆచార్య విడుదలైన రెండో రోజే చిరు దగ్గర్నుంచి ‘నువ్వు స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతాయ్ శివ’ అని మెసేజ్ చేసారు. అయితే దురదృష్టవశాత్తూ సినిమా అనుకున్నంత బాగా రాలేదు!" అని చెప్పుకొచ్చారు కొరటాల

మరింత సమాచారం తెలుసుకోండి: