ఈ సంవత్సరంలో టాలీవుడ్‌ బిగ్గెస్ట్ రిలీజ్ 'దేవర' అని చెప్పుకోవచ్చు. జాన్వీ కపూర్‌ తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన తొలి సినిమా ఇదే. దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన సెకండ్ మూవీ ఇది. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే రీసెంట్‌ ప్రెస్ మీట్‌లో కొరటాల శివ మాట్లాడుతూ, "నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. అందరూ 'దేవర' నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ అంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌ గారు, కళ్యాణ్ రామ్‌ గారు, మొత్తం టీం నాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు" అని అన్నారు.

అయితే దేవర సినిమాలో కెమెరా వర్క్, సినిమా తీసిన తీరు చాలా అద్భుతంగా ఉంది. కానీ, కథ విషయంలో మనం అనుకున్నంతగా బాగులేదు. కొరటాల శివ ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీ స్టోరీ చాలా చెత్తగా ఉందని చెప్పుకోవచ్చు. దర్శకత్వం కూడా వరస్ట్ అని పేర్కొనవచ్చు. మరి అలాంటప్పుడు ఈ మూవీ కొరటాల శివ తీసిన వాటిలో ది బెస్ట్ ఎలా అవుతుంది? కొరటాల శివ తొలి సినిమా 'మిర్చి'తోనే చాలా పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్‌ని కొత్త కోణంలో చూపించి, కథను చాలా బాగా చెప్పారు. కథ కొత్తదే కాకపోయినా, సినిమా తీసిన తీరు చాలా కొత్తగా ఉంది. అందుకే ఆ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

కొరటాల శివ తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశాలను కలిపి చూపిస్తారు. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసాడు. కొరటాల శివ తొలిసారి ఎన్టీఆర్‌తో చేసిన సినిమా 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా ప్రకృతిని కాపాడాలనే సందేశాన్ని చెబుతుంది. తర్వాత 'ఆచార్య' సినిమాలో ఆయన ఆలయాలను కాపాడాలనే సందేశాన్ని చెప్పారు. ఈ సినిమాల్లో సామాజిక సందేశాలను అందిస్తూనే వాటిని మాస్ ఎంటర్టైనర్‌లు చేయగల దర్శకుడు అనే పేరు కొరటాల శివ తెచ్చుకున్నాడు.

కొరటాల శివ ముందు చేసిన సినిమాలకు, 'దేవర' సినిమాకు చాలా తేడా ఉంది. కొరటాల శివ ముందు చేసిన సినిమాల్లో సమాజానికి సంబంధించిన విషయాలు చాలా బాగా ఉండేవి. కానీ, 'దేవర' సినిమాలో అలాంటి విషయాలు ఏమీ లేవు. ఈ 'దేవర' సినిమా రెండు భాగాలుగా వస్తుందని చెప్పారు. మొదటి భాగంలో ఎక్కువగా యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ తన సొంత వాళ్లే ఆయుధాలను దొంగతనం చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఈ సినిమాలో కథ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఈ సినిమా కొరటాల శివ ముందు చేసిన సినిమాల లాగా లేదు.

కొరటాల శివ ముందు చేసిన 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' లాంటి సినిమాల్లో కథ చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. కానీ, 'దేవర' సినిమాలో కథ అంత బాగా అర్థం కావడం లేదు. అయినా కూడా, ఎన్టీఆర్ బాగా నటించడం వల్ల, అనిరుధ్ సంగీతం చాలా బాగుండటం వల్ల ఈ సినిమా ఎలాగోలా ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని గమనించకుండా పరిటాల శివ ఇదే తన కెరీర్లో బెస్ట్ మూవీ అని డబ్బులు పట్టుకోవడం చాలా మందికి మింగుడు పడటం లేదు. పాన్ ఇండియా మూవీలో తనలోని ఒక మంచి టాలెంటెడ్ దర్శకుడిని కొరటాల శివ చంపేశాడని ఇప్పుడు నెటిజన్లు సీరియస్ డిస్కషన్ కొనసాగిస్తున్నారు. బిగ్ కాన్వాస్, బిగ్ బడ్జెట్, బాహుబలి లాంటి సక్సెస్ అందుకోవాలనే తపనతో ఆయన తన దర్శకత్వ ప్రతిభను చేచేతులా బుగ్గిపాలు చేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.    'దేవర' సినిమా మొదటి భాగం నుంచి కొరటాల శివ కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. కానీ ఈ సినిమా తాను బాగానే తీశానని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: