సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అనేక ప్రకటనలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఏది నిజం , ఏది అబద్దమో తెలుసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఇకపోతే కొన్ని జనాలను అట్రాక్ట్ చేసే ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువ శాతం మీరు ఏ పని చేయకపోయినా ఇంత డబ్బు కట్టండి చాలు మీకు లక్షల్లో డబ్బులు వస్తాయి అని ప్రకటనలు కూడా అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఉన్న వారిలో అనేక మంది ఇలాంటి వారి ట్రాప్ లో పడిపోతున్నారు.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తాజాగా యువతను బాగా ఆకర్షించే ఒక విచిత్రమైన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రకటన సారాంశం ప్రకారం ధనవంతులైన కుటుంబాలకు చెందిన యువతలకు కడుపు చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాము అని ప్రకటన చేశారు. ఇక ఈ విచిత్రమైన ప్రకటనను చూసి ఓ యువకుడు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టాడు. దానితో ఈయన వారి ట్రాప్ లో పడిపోయారు. ఇక ప్రకటన ఇచ్చిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే 800 రూపాయలు కట్టాలి అని మొదట సూచించారు.

ఇక ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు పరిమిషన్ కోసం 24 వెలు ఇవ్వాలి అని సూచించారు. ఇక ఆయన 24 వేలు కూడా కట్టేశాక ఆ తరువాత మరో 3 లక్షలు పంపాలి అని డిమాండ్ చేశారట. దానితో ఆ యువకుడికి మోసపోయాను అని అర్థం అయింది. దీనితో మోసపోయాను అని గ్రహించిన యువకుడు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ సిటీలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా విచిత్రమైన ప్రకటనల బారినపడి కొంత మంది చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: