అయితే అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వైద్యులు తెలియజేశారట. కానీ రజనీకాంత్ అభిమానులు తమ హీరో హాస్పిటల్లో చేరడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పైన అటు వైద్యులు కాని కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. ఈ రోజున రజనీకాంత్ కి ఎలక్టివ్ విధానాన్ని అమలు చేయబోతున్నారట.. ప్రస్తుతం రజనీకాంత్ వయసు 73 సంవత్సరాలు అయినప్పటికీ కూడా యంగ్ హీరోలకు దీటుగానే తన చిత్రాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు వెట్టయాన్ , కూలి వంటి చిత్రాలలో బిజీగా ఉన్నారు రజనీకాంత్.
వెట్టయాన్ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. డైరెక్టర్ డీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమితాబచ్చన్, రానా ,మంజు వారియర్ ,ఫహద్ ఫాజిల్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఇలా వరుస సినిమాల షూటింగ్లో బిజీ ఉన్న రజనీకాంత్ ఒకసారిగా హాస్పిటల్ లో చేరడం జరిగింది అనే వార్త విని అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు.. మరి రజనీకాంత్ అభిమానులు వైద్యులను కానీ కుటుంబ సభ్యులను కానీ ఆరోగ్య విషయం పైన ఏదైనా తెలియజేస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేకపోతే రజనీకాంత్ స్వయంగా వెల్లడిస్తారో చూడాలి.