బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ డైరెక్షన్ , నిర్మాతగా, నటిగా తెరకెక్కించిన చిత్రం ఎమర్జెన్సీ.. ఈ సినిమా రిలీజ్ కి ముహూర్తం ఎప్పుడో ఖరారు చేసిన కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమా వ్యవహారం కోర్టులో నడుస్తూనే ఉంది.నిన్నటి రోజున ముంబై హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసిందట.. ఎమర్జెన్సీ సినిమా 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రకటించిన ఒక ఎమర్జెన్సీ నేపథ్య కథ విషయంలో తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకుండా ఉండడంతో ఈమె హైకోర్టును కూడా ఆశ్రయించింది.


ఆ తర్వాత సెన్సార్ బోర్డుకి కొన్ని మార్పులు చేయమని కంగనాకు సూచించారట. ఎమర్జెన్సీ సినిమాలో సిక్కు సంస్థల పైన తీవ్ర అభ్యంతరాన్ని కొంతమంది లాయర్లు తెలియజేశారు. సిక్కు సంస్థలను తప్పుగా చిత్రీకరించారని వీటివల్ల సమాజ ప్రతిష్టను కూడా దిగజారుచేలా ఉంటుందని ఆగ్రహాన్ని తెలియజేశారు. దీంతో సెన్సార్ బోర్డుతో సమావేశమైన కంగనా అందులో ఉండే కొన్ని సన్నివేశాలను కట్ చేయడం లేదా మార్పులు చేయడం వంటి వాటికి అంగీకరించినట్లు తెలుస్తోంది.


ఎమర్జెన్సీ సినిమా మొత్తం 13 మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు తెలియజేశారట. గతంలో ఒక ఇంటర్వ్యూలో కంగనా ఇలా మాట్లాడుతూ తన సినిమాలో తాను ఎలాంటి మార్పులు చేయనని ఎలా తీశానో అలాగే సినిమాని విడుదల చేస్తానంటూ తెలిపింది. కానీ సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో వాటిని మార్చేందుకు ఈమె అంగీకరించింది.. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రంలో మహిళల పైన హింస, అశాంతి లేని సన్నివేశాలు, రాజకీయ హింస వంటివి ఎక్కువగా ఉండడంతో సెన్సార్ బోర్డ్ వీటిని కట్ చేయాలంటూ తెలిపిందట. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ మార్గం దొరకడంతో ఆ సీన్స్ మార్పులు చేసి ఈ ఏడాదిలోపు రిలీజ్ చేస్తుందేమో చూడాలి మరి కంగనా రనౌత్.తాను నటించిన సినిమా రిలీజ్ కోసం ఈ స్టార్ హీరోయిన్ చాలానే తిప్పలు పడుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: