దేవర’ ఫలితం తేలిపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు ‘దసరా’ రేస్ పై దృష్టి పెట్టాయి. ఈసారి దసరా కు టాప్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోలు రకరకాల కారణాలతో దూరం అవ్వడంతో డబ్బింగ్ సినిమాలు చిన్న సినిమాల వార్ కొనసాగబోతోంది. దసరా కు ఒక్కరోజు ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయన్’ విడుదల కాబోతోంది. ‘జైలర్’ మూవీ తరువాత రజనీకాంత్ మ్యానియా తెలుగు ప్రేక్షకులలో మళ్ళీ పెరగడంతో రజనీకాంత్ ఈసారి కూడ మ్యాజిక్ చేస్తాడా అన్నసందేహాలు చాలమందిలో ఉన్నాయి.



ఈమూవీలో రానా కూడ కీలకపాత్రలో నటించడంతో ఈమూవీ పట్ల తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఈమూవీ విడుదల తరువాత ఒక్కరోజు గ్యాప్ లో విడుదలకాబోతున్న గోపీచంద్ శ్రీను వైట్లల ‘విశ్వం’ మూవీ ఏమైనా అనుకోని విజయాన్ని సాదిస్తుందా అన్న ఊహాగానాలు వస్తున్నాయి.



ఈమూవీ గోపీచంద్ కెరియర్ తో పాటు దర్శకుడు శ్రీను వైట్ల కెరియర్ కు కూడ చాలకీలకంగా మారింది. అదేవిధంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న సుధీర్ బాబు నటించిన ‘మానాన్న సూపర్ హీరో’ నాన్న సెంటిమెంట్ ను నమ్ముకుని ఈ దసరా కు విడుదల అవుతోంది. ఈమూవీలో భావోద్వేగాలతో పాటు ఫ్యామిలీ డ్రామా చాల ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు.    



కన్నడ హీరో ధృవ నటించిన ‘మార్టిన్’ ని ఏకకాలంలో పదకొండు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండే ఈమూవీ విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు. ఈమూవీలతో పాటు సుహాస్ నటించిన ‘జనక అయితే గనుక’ మూవీ టైటిల్ ఇప్పటికే సంచలనంగా మారడంతో పాటు ఈమూవీ ప్రాజెక్ట్ ను విడుదల చేయబోతున్న దిల్ రాజ్ ఈమూవీ పై భారీ అంచనాలతో లీకులు ఇస్తున్నాడు. ఈసినిమాలతో పాటు త్రిప్తి డిమ్రి నటించిన ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ మూవీ కూడ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈసూపర్ సిక్స్ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తి బాగా ఉంది..  


 


మరింత సమాచారం తెలుసుకోండి: