తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరో లలో నందమూరి నటసింహం బాలయ్య , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు . ఇక పోతే ఓ విషయంలో నాగార్జున ను బాలయ్య ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది . అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోగా నటించడం కంటే కూడా ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించడానికి అలాగే టీవీ షో లకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఎక్కువ ఆసక్తి ని చూపిస్తున్నాడు.

అందులో భాగంగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందుతున్న కుబేర సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ మూవీ లో కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య కూడా ఈ మధ్యకాలంలో నాగార్జునను ఈ విషయంలో ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

బాలయ్య చాలా రోజుల క్రితం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ గురించి అప్డేట్లు రావడం లేదు అని బాలయ్య అభిమానులు కాస్త నిరోత్సాహంగా ఉంటే ఈయన మాత్రం తాజాగా ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ కొత్త సీజన్ను ప్రారంభించాడు. తాజాగా ఈ షో సీజన్ షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇలా ఈ విషయంలో నాగార్జున ను బాలయ్య ఫాలో అవుతున్నాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: