తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న కొంత మంది దర్శకులు టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున నలుగురితో సినిమాలను చేసి ఒక హీరోకి మాత్రం హిట్ ఇవ్వలేదు. అతను ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలానే సినిమాలను రూపొందించాడు. అందులో ఇంద్ర సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

బి గోపాల్ , బాలకృష్ణ కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. అందులో మొదటగా వచ్చిన లారీ డ్రైవర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. వీరి కాంబోలో ఐదవ సినిమాగా పలనాటి బ్రహ్మనాయుడు మూవీ వచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.

విక్టరీ వెంకటేష్ , బి గోపాల్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో బొబ్బిలి రాజా మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో వెంకటేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇకపోతే ఇంత మంది హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన బి గోపాల్ , నాగార్జునకు మాత్రం సరైన విజయాన్ని అందించలేకపోయాడు. వీరి కాంబోలో మొదటగా కలెక్టర్ గారి అబ్బాయి వచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వీరి కాంబోలో విజయ్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇలా బి గోపాల్ ... చిరు , బాలయ్య , వెంకటేష్ లకు బ్లాక్ బాస్టర్ లు ఇచ్చిన నాగార్జున కు మాత్రం బ్లాక్ బాస్టర్ ఇవ్వలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: