ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు ఇండియన్ మార్కెట్ టోటల్ గా డామినేట్ చేస్తున్నాయి . చాలా వరకు మన తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి . ఈ సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితులే నెలకున్నాయి . ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల లో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తం గా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సినిమాల లిస్టు లో ఏకంగా మొదటి రెండు స్థానాల్లో తెలుగు సినిమాలే ఉన్నాయి . అలాగే మొత్తం ఐదు స్థానాల్లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి . మరి మొత్తం ఐదు స్థానాల్లో ఉన్న సినిమా లు ఏవి ..? అందు లో మన తెలుగు సినిమాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే వివరాలు తెలుసు కుందాం.

ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్ వాసులు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 183.20 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా 157 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ 104.75 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలవగా , "స్త్రీ 2" సినిమా 83.45 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 79.30 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. ఇలా ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను మొదటి రోజు వసూలు చేసిన సినిమాలు లిస్టులో టాప్ 5 మూడు తెలుగు సినిమాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: