- ప‌వ‌న్ నిజాయితీ మాట‌లు క‌ల్లిబొల్లి క‌బుర్లేనా...!
- దోపిడీ, దందాలు మొద‌లు పెట్టేసిన జ‌న‌సేన ఎమ్మెల్యేలు
- అదేమంటే ఇదే మంచి ఛాన్స్ .. నాలుగు రాళ్లు వెన‌కేసుకోవ‌ద్దా అని ప్ర‌శ్న‌లు


( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )


జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ పార్టీని ఎంతో నీతి.. నిజాయితీతో ఉండేలా చూస్తామ‌ని చెపుతుంటారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఆయ‌న‌ది అదే బాట‌... ప‌వ‌న్ మాట చెప్పడం మాత్ర‌మే కాదు.. ఆయ‌న ఒక్క‌డు మాత్ర‌మే నీతి.. నిజాయితీల‌తో ఉంటే స‌రిపోదు క‌దా.. త‌మ పార్టీలో అంద‌రూ అలా ఉండేలా చూడాల్సిన బాధ్య‌త ఆయ‌న మీద ఉంది. అయితే కొంద‌రు జ‌న‌సేన ఎమ్మెల్యేలు మాత్రం కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 100 రోజులు అవుతోందో లేదో వెంట‌నే వ‌సూళ్లు మొద‌లు పెట్టేశారు.


మ‌రీ ముఖ్యంగా న‌లుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు చేస్తోన్న అవినీతి కంపు ఇప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది. అస‌లు సీటు ఎందుకు ఇచ్చార్రా బాబు .. జ‌న‌సేన ఏపీలో ఖ‌చ్చితంగా ఓడిపోయే సీటు అవుతుంద‌ని అంద‌రూ అనుకున్న చోట గెలిచిన ఓ కుర్ర ఎమ్మెల్యే ఇసుక దోపిడీలో భారీగా చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. రాష్ట్రంలో ఎక్క‌డా లేనంత ఇసుక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే దొరుకుతుంది.. ఇక క‌నీసం టీడీపీ వాళ్ల‌కు కూడా ఏ మాత్రం చేయి విద‌ల్చ‌కుండా మొత్తం వ్య‌వ‌హారాలు అన్నీ ఆయ‌నే చ‌క్క పెట్టేసుకుంటున్నాడ‌ని టాక్ ?


ఇక జ‌న‌సేన‌కు ఏ మాత్రం గెలిచే స్కోప్ లేని ప్రాంతంలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డుతున్నారంటున్నారు. ఒక నేత ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి గెలిచారు. ఆయ‌నకు ఇదే త‌న‌కు బంప‌ర్ ఛాన్స్‌.. ఇంత‌కు మించి అవ‌కాశం వ‌స్తుందా ? అని చేతివాటంలో అవినీతి చేస్తుంటే.. ప్లేస్ మారి.. పార్టీ మారి గెలిచిన మ‌రో నేత‌పై కూడా అప్పుడే అవినీతి ఆరోప‌ణ‌లు దారుణంగా వ‌స్తున్నాయి. అస‌లు కూట‌మిలో టీడీపీ , బీజేపీ వాళ్లే ఆయ‌న అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తూ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆయ‌న తీరు ప‌ట్ల మూడు నెల‌ల‌కే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది.


ఇక ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన ఎమ్మెల్యే ఒక‌రు అక్ర‌మ గ్రావెల్ త‌వ్వ‌కాల్లో జోక్యం చేసుకోవ‌డంతో పాటు త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త రాసిన ఓ విలేక‌రిని ఇంటికి పిలిచి మ‌రీ వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆ ప‌త్రిక విలేక‌రి పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. త‌న నియోజక వర్గంలో ఉన్న ఫార్మా కంపెనీలతో పెట్టిన మీటింగ్ కి కంపెనీల యజమానులు కాకుండా వారి ప్రతినిధులు రావడంతో ఫైర్ అయ్యి... త‌న ద‌గ్గ‌ర‌కు డైరెక్టుగా కంపెనీ య‌జ‌మానులే రావాలంటూ ఈ మీటింగ్ కూడా వాయిదా వేయించార‌ని టాక్ ?  ఏదేమైనా జ‌న‌సేన ఎమ్మెల్యేల విష‌యంలో ప‌వ‌న్ కంట్రోల్ స‌రిగా లేక‌పోతే జ‌న‌సేన పార్టీకి కూడా అవినీతి మ‌కిలీ మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: