టాలీవుడ్ అందాల భరిణి ర‌ష్మిక మంద‌న్న గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా దుమ్ము దులిపిన శ్రీవల్లి ఇపుడు పుష్ప పార్ట్ 2తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ పడింది. పుష్ప రాజ్ ప్రేమికురాలు శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక‌ కనబరిచిన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఆమె యానిమ‌ల్ లో కూడా ర‌ణ‌బీర్ సరసన అద్భుతమైన న‌ట‌న కనబరిచి మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాను చాటుకుందనే చెప్పుకోవాలి.

ఇక అసలు విషయంలోకి వెళితే, ర‌ష్మిక సినిమాలు ఒకవైపు చేస్తూనే, ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాల్లో త‌న అభిమానుల‌కు ట‌చ్ లో ఉండడానికి యత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అద్భుత‌మైన ఫోటో షూట్స్ కి సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ, ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ర‌ష్మిక చాలా సంప్రదాయమైన డిజైన‌ర్ దుస్తుల్లో సోషల్ మీడియాలో తళుక్కుమంది. బ్యాక్ లెస్ లుక్కుతో జారు ముడి వేసిన బ్లౌజ్ అందాన్ని ఎలివేట్ చేస్తూ, త‌న అంద‌మైన వాలుజ‌డ‌ కిందికి జారవిడుస్తూ సంప్రదాయ అందాన్ని ప్రదర్శించింది. దాంతో ఈ ఫోటోగ్రాఫ్ ప్రస్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

దాంతో యువ‌త‌రం సదరు ఫోటోని వాట్సాపుల్లోనూ వైర‌ల్ చేసుకుంటూ సంతృప్తి పొందుతున్నారు. ఇకపోతే నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక‌కు ఇపుడు ఉత్తరాదిలో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. చాలా మంది సీనియ‌ర్ హీరోయిన్లను కాదని, ఇపుడు ర‌ష్మికను పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే మ‌రోవైపు ర‌ష్మిక హిందీ - తెలుగులో కూడా వ‌రుస భారీ ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతూ ఫుల్ బిజీగా గడుపుతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు ఏ.ఆర్ మురుగ‌దాస్ - స‌ల్మాన్ కాంబినేష‌న్ మూవీ సికంద‌ర్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ మూవీ మ‌రో పాథ్ బ్రేకింగ్ హిట్ అవుతుంద‌ని, తన కెరీర్ బాలీవుడ్లో మరింత ముందుకి సాగిపోతుందని ర‌ష్మిక ఆశిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: