నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలాగే వరస విజయాలను అందుకుంటున్నాడు. అఖండ మూవీ కంటే ముందు వరుసగా అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" మూవీ దగ్గర నుండి వరస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాడు. ఆఖరుగా బాలయ్య , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది.

బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయండి నేపథ్యంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ కోసం బాలయ్య తన ఓల్డ్ ఫార్మాట్ ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కొన్ని సంవత్సరాల క్రితం నటించిన చాలా సినిమాలలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

కానీ ఈ మధ్య కాలంలో బాలయ్య నటించిన సినిమాలలో ముగ్గురు హీరోయిన్ లేరు. ఇక ప్రస్తుతం NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: