ఇప్పుడు నాలుగో రోజు కూడా దేవర అదిరిపోయే కలెక్షన్లు అందుకుంది.. ఒక కేవలం ఓవర్సీస్ లోనే 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. నాలుగో రోజు కూడా సక్సెస్ఫుల్గా కలెక్షన్లు అందుకుంది. నాలుగో రోజు కలెక్షన్ విషయానికొస్తే ఒక కేవలం నైజం మార్కెట్లోనే దేవర సాలిడ్ వసూలను అందుకుంది. తాజా లెక్కల ప్రకారం దేవర నైజంలో నాలుగో రోజు 2.3 కోట్ల షేరును రాబట్టింది. మొత్తంగా నాలుగో రోజు రూ.40 కోట్లకు పైగ కలెక్షన్లను అందుకుంది. ఇలా దేవర సాలిడ్ రన్‌తో దూసుకుపోతుంది.
దసరా హాలిడేస్ కలిసిరానున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మొదటి నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ మూవీ ఏకంగా 90.09 కోట్ల షేర్ కలెక్షన్స్ ని అందుకోగలిగింది. వీక్ డేస్ లో నిలకడగా కలెక్షన్స్ కొనసాగితే వారాంతానికి 100 కోట్ల షేర్ ని చాలా ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ సినిమాకి ఎన్టీఆర్ వన్ మెన్ షో, అనిరుద్ మ్యూజిక్ ప్రధాన బలంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుద్ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. అందుకే కాన్సెప్ట్ బలంగా జనాల్లోకి వెళ్తోంది. ఇక ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.