ఇక‌ మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాబోయే పాన్ ఇండియా సినిమాలలో పుష్ప2 కూడా ఒకటి.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటనతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న నేటి తరం నటులలో అల్లు అర్జున్ ఒక్కడే. ఇక దీంతో పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నెలకొన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు అయితే పుష్ప2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ జ‌ట్ స్పీడ్ లో ఈ సినిమా ఈ షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చినట్టు అంటున్నారు. డిసెంబర్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా థీయాట్రికల్, నాన్ థీయట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్ ని 270 కోట్లకి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అలాగే థీయాట్రికల్ బిజినెస్ 550 కోట్ల వరకు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బిజినెస్ డీల్స్ చూస్తుంటే సినిమా పైన ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పుష్ప ఫ్రాంచైజీలో పార్ట్ టూ త్రీ కూడా ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా పాత్రికోసం సుకుమార్ కు ఓకే చెప్పాడట.

సుకుమార్ కూడా ఇప్పుడు ‘పుష్ప 3’ కోసం అదిరిపోయే లీడ్ ఇవ్వడానికి సిద్ధం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో నెక్స్ట్ పార్ట్ కి లీడ్ ని సుకుమార్ రెడీ చేసారంట. త్వరలో ఈ సీక్వెన్స్ షూటింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ లీడ్ కోసం ఒక స్టార్ హీరోని రంగంలోకి దించుతున్నారంట. మరి అది ఎంత వరకు పాజిబుల్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ‘పుష్ప 2’ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా చాలా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పార్ట్ 3పైన ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు
 

మరింత సమాచారం తెలుసుకోండి: